జాతీయ వార్తలు

దేశవాళీ గోవులతో ప్రత్యేక డెయిరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: దేశంలో గోవులను, గోశాలలను సంరక్షించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశవాళీ గోవులతో ప్రత్యేకంగా పాడి పరిశ్రమలను (డెయిరీ ప్లాంట్లను) ఏర్పాటు చేయడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పథకం కింద పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం, గోవుల అక్రమ రవాణాతోపాటు గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా జంతు సంక్షేమ బోర్డులకు సాధికారత కల్పించడం వీటిలో ప్రధానమైనవి. ‘గోవుల వంశం, గోశాలలు’ అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ సోమవారం ఈ విషయాలను వెల్లడించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలుస్తున్న గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, గోవుల యజమానులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.