జాతీయ వార్తలు

పవన్ సీఎం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 15: బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య శుక్రవారం ఇక్కడ స్నేహం కుదిరింది. ఈ ఇద్దరు నేతలు పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని వారు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్టు మాయావతి ప్రకటించారు. ఇందుకు బదులుగా మాయావతి దేశ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘ఇది మా ఆకాంక్ష. జ్వలిస్తున్న కోరిక’ అని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తును ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని మాయావతి అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుతున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నారు. బీఎస్‌పీ.. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పాటు కొన్ని కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోటీ చేస్తుంది’ అని మాయావతి అన్నారు. బీఎస్‌పీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు పెద్ద దెబ్బ. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన గత సంవత్సరం మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుంటారని, తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు కుదురుతుందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది.
అఖిలేశ్ యాదవ్, మాయావతి కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ఉత్తరప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ఆ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేశారు. ‘పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఎలాంటి వివాదం లేదు’ అని మాయావతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఏ ప్రాంతీయ పార్టీతోనయినా జట్టు కట్టడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని మాయావతి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీ చేయాలని జనసేన జనవరి నెలలోనే నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, అతని కుమారుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావులతో కూడా పవన్ కళ్యాణ్ జనవరిలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అతిపెద్ద ఎన్నికల అంశంగా మారింది.