జాతీయ వార్తలు

త్వరలోనే తేల్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో వైకాపా సభ్యులు సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్లకు బదులిచ్చారు. ఏపీకి అందించాల్సిన సాయంపై సిఎంతో జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీకి చెందిన సభ్యులతోపాటు ఇతర సభ్యులూ పలుమార్లు ప్రస్తావించారని, తానూ పలుమార్లు హామీ ఇచ్చానన్నారు. సమస్యపై కేంద్రం దృష్టి సారించిందని, రాష్ట్ర ఆదాయం, ఖర్చు, ఇతర అంశాలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమని అంగీకరిస్తూ, నష్టాన్ని పూడ్చాలన్న సభ్యుల వాదనతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. చట్టపరంగా ఏపీకి కేంద్రం ఇచ్చిన అన్ని హామీలనూ లోతుగా పరిశీలిస్తోంది. ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలూ కీలక దశకు చేరుకున్నాయి. త్వరలోనే పరిష్కారాన్ని ప్రకటిస్తామని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
స్పీకర్‌పై ఆగ్రహం
‘హోదా’ డిమాండ్‌తో పోడియం వద్ద ఉదయం 11 గంటల నుంచి పడిగాపులు కాస్తున్న వైకాపా సభ్యుల గోడు పట్టించుకోరా? అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. గతంలో చాలామంది స్పీకర్లనే చూశాం. ఇలా ఎవ్వరూ వ్యవహరించలేదు. వైకాపా సభ్యులకు అభిప్రాయాలు తెలిపే అవకాశం ఇవ్వరా? గొడవపై మా అభిప్రాయాలు స్వీకరించిరా? అంటూ ములాయం స్పీకర్‌ను నిలదీశారు. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే వైకాపా సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, అవినాష్ రెడ్డి పోడియం వద్ద నిలబడి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ పెద్దపెట్టున నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఏపీ సమస్యలపై ఆర్థిక మంత్రి జైట్లీ స్పందించినందున, సభ్యులు గొడవమాని వారి స్థానాలకు వెళ్లాలని స్పీకర్ సుమిత్ర విజ్ఞప్తి చేసినా వైకాపా సభ్యులు పోడియం వద్దే ఉండిపోయారు. ఆ గొడవలోనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో మల్లిఖార్జున ఖర్గే స్పందిస్తూ, వైకాపా సభ్యుల గొడవ జరుగుతుండగా సభను నడిపించటం బాగాలేదన్నారు. ఉదయం నుంచి సభ్యులు పోడియం వద్దే నిలబడ్డారని, ముందు వాళ్ల సమస్యలు పరిష్కరించారని ఖర్గే సూచించారు. ఏపీ అంశంపై ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం ఇచ్చినందున, ఇక తానేమీ చేయలేనని స్పీకర్ అంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో జీరో అవర్‌లోనూ వైకాపా సభ్యులు పోడియం వద్దే నిలబడి ప్రత్యేక హోదా డిమాండ్‌తో నినాదాలిచ్చారు.
ఇదేం బాగాలేదు: ములాయం
వైకాపా సభ్యుల గొడవ మధ్య సభను కొనసాగించటం బాగాలేదని ములాయం అన్నారు. ‘వాళ్ల వాదన వినండి లేదా మాకైనా మాట్లాడే అవకాశమివ్వండి. సమస్య పరిష్కారానికి సలహాలిస్తాం’ అని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సభ్యులు అలా మాట్లాడకూడదని స్పీకర్ వారిస్తున్నా, ములాయం పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది స్పీకర్లను చూశామని, ఎవ్వరూ ఇలా వ్యవహరించలేదంటూ వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభకు ఆరుసార్లు ఎన్నికయ్యా. శాసన సభకు 11సార్లు ఎన్నికయ్యా. సీనియర్ల నుంచి మీరు సలహాలు తీసుకోవటం లేద’ని ఆగ్రహించారు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైకాపా పక్షనేత రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి మన్మోహన్ హామీని అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సమర్థించారని గుర్తు చేశారు. భాజపా, తెదేపాలు ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని చెప్పారు.