జాతీయ వార్తలు

నిబంధనలు అతిక్రమిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఖైదీల విడుదల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ పూర్తిచేసింది. ప్రస్తుతం ఆ జీవోలు కాలం చెల్లినవిగా ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్న మావోయిస్టు షీట్‌ను తొలగించాలని ధర్మాసనాన్ని కోరగా చేయగా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఎ.ఎం ఖన్‌వీల్క్‌ర్, జస్టిస్ డి.వై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 2007 ఆగస్టు 15 సిపాయిల తిరుగుబాటు జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురష్కరించుకొని అప్పటి వైఎస్సాఆర్ ప్రభుత్వం పదిహేను వందల మంది ఖైదీలను విడుదల చేసేందుకు 196, 197 జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ జీవోలను సవాల్ చేస్తూ 2007 ఆగస్టు 14న సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖైదీలను విడుదల చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది. 2009లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం స్టే ఎత్తివేసింది. అనంతరం కొంతమంది ఖైదీలు విడుదలయ్యారు.