జాతీయ వార్తలు

ప్రధాని కార్యదర్శి వేతనం నెలకు రూ. 2.01 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ)లో పనిచేస్తున్న అధికారులందరి వేతనాలను సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టంలోని సెక్షన్ 4 కింద పిఎంఒ తనంత తానుగా బహిర్గతం చేసింది. పిఎంఒ వెల్లడించిన ఈ వివరాల ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారి భాస్కర్ ఖుల్బే అందరికన్నా ఎక్కువగా నెలకు రూ. 2.01 లక్షల వేతనం పొందుతున్నారు. ప్రధానమంత్రికి కార్యదర్శిగా పనిచేస్తున్న ఖుల్బే ఈ సంవత్సరం జూన్ మొదటి తేదీన పొందిన వేతనం వివరాలను పిఎంఒ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి పికె మిశ్రా నెలకు రూ. 1,62,500 వేతనంతో పాటు పింఛను పొందుతున్నారు. ఈ బ్యూరోక్రాట్లంతా సివిల్ సర్వెంట్లుగా పదవీవిరమణ పొందారు. పిఎంఒలోని ఆరుగురు జాయింట్ సెక్రెటరీలు తరుణ్ బజాజ్, వినయ్ మోహన్ క్వాట్రా, టివి సోమనాథన్, ఎకె శర్మ, అనురాగ్ జైన్, దేబశ్రీ ముఖర్జీలు నెలకు రూ. 1.55 లక్షల నుంచి రూ. 1.77 లక్షల మధ్య వేతనం పొందుతున్నారు.
పిఎంఒ ప్రైవేటు కార్యదర్శులు రాజీవ్ టోప్నో, సంజీవ్ కుమార్ సింగ్లా వరుసగా నెలకు రూ. 1.46 లక్షలు, రూ. 1.38 లక్షల చొప్పున వేతనం పొందుతున్నారు. సమాచార అధికారి శరత్ చందర్ రూ. 1.26 లక్షలు, ప్రజాసంబంధాల అధికారి (పిఆర్‌ఒ) జెఎం ఠక్కర్ రూ. 99వేలు వేతనం పొందుతున్నట్లు పిఎంఒ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రధాని మోదీకి సన్నిహిత సహాయకుడు, పిఎంఒలో ఒఎస్‌డిగా పనిచేస్తున్న సంజయ్ ఆర్ భావసర్ సహా అయిదుగురు బ్యూరోక్రాట్లు నెలకు రూ. 1.1 లక్షల చొప్పున వేతనం పొందుతున్నారు. భావసర్‌తో పాటు హిరేన్ జోషి, ప్రతీక్ దోషి, హేమంగ్ జని, అశుతోష్ నారాయణ్ సింగ్ పిఎంఒలో ఒఎస్‌డిలుగా పనిచేస్తున్నారు. మాజీ ప్రధానులు అటల్ బిహారి వాజపేయి, మన్మోహన్ సింగ్‌ల కార్యదర్శులకు చెల్లించిన వేతనాలను కూడా పిఎంఒ వెల్లడించింది. వాజపేయి కార్యదర్శి ఎన్‌సి జింగ్టా నెలకు రూ. 1.42 లక్షల వేతనం, మన్మోహన్ సింగ్ కార్యదర్శి జి.మురళీధర్ పిళ్లై నెలకు రూ. ఒక లక్ష వేతనంతో పాటు పింఛను పొందారు.