జాతీయ వార్తలు

కోలుకుంటున్న సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భుజం గాయం నుంచి వేగవంతంగా కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ సాధారణ స్థితికి చేరుకుంటోందని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు సోమవారం వెల్లడించారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి వెళ్లిన సోనియా గాంధీ అక్కడ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ఆరు రోజుల క్రితం గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సోనియా శరీరంలో అన్ని వ్యవస్థలూ కుదుటపడ్డాయని, కనుక వచ్చే రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.