జాతీయ వార్తలు

నేడు ఇరోమ్ షర్మిల దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 8: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని గా పదహారేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల మంగళవారం తన దీక్షను విరమించనున్నారు. 44 ఏళ్ల హక్కుల కార్యకర్తఅయిన షర్మిలను 2000 సంవత్సరం నుంచి జైలుగా మార్చిన ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. ఆమె తన దీక్షను స్థానిక న్యాయస్థానంలో విరమిస్తారు. ‘షర్మిలను ఉదయం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. అక్కడ న్యాయమూర్తి ఆమెను కస్టడీ నుంచి విడుదల చేస్తారు. ఆ తరువాత ఆమె నిరాహార దీక్షను విరమిస్తారు’ అని ఆమె సోదరుడు సింఘజిత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మద్దతుదారులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.
అయితే షర్మిల తల్లి సఖీదేవి మాత్రం దీక్ష విరమణకు హాజరు కావటం లేదు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసి విజయంతో తిరిగి రావాలని తల్లి కోరుకుంటున్నారని ఆమె సోదరుడు తెలిపారు. దీక్ష విరమణ తరువాత షర్మిల ఎక్కడికి వెళ్తారో తెలియదని ఆయన అన్నారు. శరీరం సాధారణ స్థాయికి చేరుకునే దాకా షర్మిల ద్రవ పదార్థాలే తీసుకుంటారని, పదహారేళ్లుగా ఘన పదార్థం తీసుకోకుండా ఒకేసారి తీసుకోవటం ప్రమాదమని, అందుకే నెమ్మదిగా పౌష్టికాహారం తీసుకుంటారని ఆయన వివరించారు.