జాతీయ వార్తలు

అది ‘నడవలేని కార్ల’ తయారీ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: కాంగ్రెస్ పార్టీ పతనానికి నాయకత్వ సమస్యలే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. రాజకీయ గుత్త్ధాపత్యంతో దశాబ్దాలపాటు నెట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పప్పులు ఉడకం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ‘నడవలేని కార్లను’ తయారుచేసే సంస్థ లాంటిదిగా ఆయన పేర్కొంటూ పరోక్షంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రస్తుతం ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో తమ నాయకులను కోల్పోతోంది. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఆరు దశాబ్దాలపాటు గుత్త్ధాపత్యాన్ని కొనసాగించడంతోపాటు 50 ఏళ్లకుపైగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అకస్మాత్తుగా తన సిద్ధాంతాలను మార్చుకుంటోంది. ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలా చేయకూడదు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎంతమేరకు అడ్డంకులు సృష్టించగలిగితే అంత విజయం సాధించినట్లు కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణం ఇదే. అంతేకాకుండా నాయకత్వంలో పటిమ సన్నగిల్లడం కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో యోధానుయోధులైన నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ మంచిచెడుల గురించి పార్టీ విధాన నిర్ణేతలు లేదా నిర్ణేతతో మాట్లాడే దమ్ము, ధైర్యం వారికి ఏమాత్రం లేదు’ అని పిటిఐ వార్తా సంస్థతో జైట్లీ అన్నారు.