జాతీయ వార్తలు

మహాశే్వతాదేవి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 28: గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం అహరహం పోరాడి తన రచనల ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపిన ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశే్వతాదేవి (91) గురువారం తుదిశ్వాస విడిచారు. కిడ్ని, ఊపిరి తిత్తులు, వయసు పరమైన రుగ్మతలతో గత కొంత కాలంగా బాధపడుతున్న శే్వతాదేవి శరీరంలోని కీలక అవయవాలు పనిచేయక పోవడం వల్ల గుండె ఆగిపోవడంతో కన్నుమూశారని ఇక్కడి బెల్లె వ్యూ క్లీనిక్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తన రచనల ద్వారానే కాకుండా సామాజికంగా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించి తొమ్మిది పదుల తన నిండు జీవితాన్ని నిమ్నజాతుల శ్రేయస్సుకే అంకితం చేసిన శే్వతాదేవి సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్, మెగసెసె, సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్ వంటి అవార్డులు లభించాయి. పేదల గళమే తన కలం అన్నట్టుగా ఆమె రచనలు చైతన్యపూరితంగా సాగాయి. ఓ విద్యావేత్తగా గ్రామీణ భారతంలోనే ఎక్కువకాలం గడిపి అక్కడి ప్రజలపై పరిశోధన చేసిన శే్వతాదేవి తన సృజనాత్మకతను జోడించి వారి జీవితాలను తన రచనల ద్వారా కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించారు. ప్రధాన సమాజం విస్మరించిన గ్రామీణ భారత ప్రజల జీవన స్థితిగతులకు, గిరిజన, నిమ్నవర్గాల దయనీయ పరిస్థితులకు ఆమె కలమే గళమైంది. మనసును కదిలించే ఎన్నో రచనలకు గ్రామీణ జీవనం పట్ల శే్వతాదేవికి ఉన్న అవగాహనే తోడయింది. ఆమెలో రచయితే కాదు, సమాజాన్ని లోతుగా స్పృశించి దాని ఆనుపానులు తెలుసుకో గలిగే పాత్రికేయ లక్షణమూ ఉండటం వల్లే హజార్ చురాషిర్ మా (మదర్ ఆఫ్ 1084), అరన్‌యేర్ అధికార్ (రైట్ టుది ఫారెస్ట్), ఝాన్సిర్ రాణి (క్వీన్ ఆఫ్ ఝాన్సీ), అగ్ని గర్భ (ది ఫైర్ విత్ ఇన్), రుడాలి, సుభాగ బసంత వంటి అద్భుత రచనలు వెలువడ్డాయి. గిరిజనుల పట్ల శే్వతాదేవికి ఉన్న మమకారం ఆమె రచనలకే పరిమితం కాలేదు. ఎన్నో గిరిజన సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా గిరిజనుల కోసం ప్రభుత్వాలతో గట్టిగా వాదనలకూ దిగిన సందర్భాలెన్నో ఉన్నాయి.
మహాశే్వతాదేవి మరణంతో భారత దేశం ఓ గొప్ప రచయితను, తల్లి లాంటి గొప్ప వ్యక్తిని పశ్చిమ బెంగాల్ కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సింగూర్, నందిగ్రామ్ ఉద్యమ సమయాల్లో శే్వతాదేవి ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకున్నారు.
సిఎం కెసిఆర్ సంతాపం
మహశే్వతాదేవి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు. దేశంలో ఆదివాసుల జీవితాలను సాహిత్యంలో ప్రతిఫలింప చేసిన రచయిత్రిగా మహశే్వతాదేవి పేరు గడించారన్నారు.

మహశే్వతాదేవి (ఫైల్ ఫోటో)