జాతీయ వార్తలు

ప్రముఖ చిత్రకారుడు ఎస్‌హెచ్ రజా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: సుప్రసిద్ధ చిత్రకారుడు ఎస్‌హెచ్ రజా (94) శనివారం కన్నుమూశారు. ఆధునిక చిత్రకళకు చిరునామాగా నిలిచిన ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. భారతీయ చిత్రకళా వైభవాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప కళాకారుడాయన. బిందు, పురుష్-ప్రకృతి, నారీల ఇతివృత్తంతో రజా గీసిన చిత్రాలు ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన శనివారం ఉదయం ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని లలిత కళా అకాడెమీ మాజీ చైర్మన్, కవి అశోక్ వాజపేయి వెల్లడించారు. చిత్రకళకు ఆయన అందించిన సేవలు అజరామరమని శ్లాఘించారు. మధ్యప్రదేశ్‌లోని బాబారియాలో 1922లో రజా జన్మించారు. 12 ఏటనే కుంచెపట్టిన ఆయన హైస్కూల్ విద్య తరువాత నాగ్‌పూర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. తరువాత ముంబయి జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చిత్రకళను అభ్యసించారు. 1950-53లో ప్యారిస్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. రజాకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. పద్మశ్రీ, లలిత కళా అకాడెమీ ఫెలోషిప్ అందుకున్నారు. 2007లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. ఐరోపా దేశాలన్నింటిలోనూ పర్యటించిన ఆయన ఫ్రాన్స్‌లో చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. రజా ప్రకృతి ఆరాధికులు. ఎఫ్‌ఎం హుస్సేన్, ఎఫ్‌ఎన్ సౌజా, కెహెచ్ అరా, హెచ్‌ఎ గడే, ఎస్‌కె బక్రేలతో కలిసి బాంబే ప్రోగ్రసీవ్ ఆర్టిస్ట్స్‌ను ఏర్పాటు చేశారు.