జాతీయ వార్తలు

ఇదే చివరి మజిలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: దాదాపు మూడు దశాబ్దాలపాటు భారత్ దేశ రక్షణలో గురుతరమైన పాత్రను పోషించిన ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ’ ఐఎన్‌ఎస్ విరాట్ తుది ప్రయాణాన్ని ముంబయి నుంచి కోచీకి శనివారం మొదలుపెట్టింది. ఈ ఏడాది చివర్లో నౌకాదళం నుంచి పూర్తిగా వైదొలుగుతున్న 750 అడుగుల ఈ మహానౌకకు ఇదే చివరి ప్రయాణం అవుతుంది. బుధవారం నాటికి ఈ నౌక కోచీ చేరుకోగలదని భావిస్తున్నారు. భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ విరాట్‌ది ఎన్నో రంగాల్లో ఆరితేరిన చరిత్ర. భారత నౌకాదళంలో పనిచేస్తున్న చివరి బ్రిటిష్ నిర్మిత నౌక కూడా ఇదే. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాప్రదర్శనలో ఇది స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. 1987లో ఐఎన్‌ఎస్ విరాట్ భారత నౌకారంగంలోకి ప్రవేశించింది. వైట్ టైగర్ యుద్ధ విమానాలతో జలాంత్గామి నిరోధక హెలీకాప్టర్లకు కమెండోతరహా హెలీకాప్టర్లకు ఇది వేదిగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఆపరేషన్ జూపిటర్‌లో ప్రధాన పాత్ర వహించింది. అలాగే కార్గిల్ యుద్ధ సమయంలోనూ విరాట్ అందించిన సేవలు నిరుపమానం. అమెరికా, ఫ్రాన్స్ సహా అనేక దేశాలతో జరిగిన సంయుక్త విన్యాసాల్లో కూడా ఇది పాల్గొంది.