జాతీయ వార్తలు

లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 23: శ్రీనగర్‌లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాదులకు పంజాబ్ టీనేజర్ సవాల్ విసిరింది. జమ్మూకాశ్మీర్‌లో చీటికి మాటికి పాకిస్తాన్ జాతీయ పతాకాలు ఎగరవేయడాన్ని 15 ఏళ్ల ఝాన్వి బెహల్ గర్హించింది. ఆగస్టు 15న శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానని ఆమె సవాల్ చేసింది. ‘మైన్ 15 ఆగస్ట్ కో లాల్‌చౌక్ (శ్రీనగర్)పే తిరంగ్ ఫైరాంగీ కిసి మైన్ హిమత్ హై తో రోక్ కే దిఖాయే’ అంటూ సోషల్ మీడియా ద్వారా వేర్పాటువాదులను హెచ్చరించింది. ఆందోళనల పేరుతో ఇటీవల కాశ్మీర్‌లో జాతీయ జెండాను అవమానించడం, పాకిస్తాన్ జెండాను ఎగరవేయడంపై ఝాన్వి బెహల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్‌లోని లూధియానకు చెందిన 15 ఏళ్ల ఝాన్వి బెహల్ ఇంతకు ముందు జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ను బహిరంగ చర్చకు ఆహ్వానించి వార్తల్లోకి వచ్చింది.