జాతీయ వార్తలు

దళితుల ఏకీకరణకు మాలమహానాడు దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో ఎక్కడలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కొందరు కుట్ర పన్నుతున్నారని మాలమహానాడు నాయకుడు జి చెన్నయ్య విమర్శించారు. రాజ్యాధికార సాధన కోసం దళితుల్లో ఏకీకరణ జరగాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాలమహానాడు చేప్పట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకొన్నాయి. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లోని దళితులు, మహారులు, చమరులు, రవిదాసులు, మాంగులు, జాటోల మధ్య వర్గీకరణను మాయావతి, పాశ్వాన్ లాంటివారు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఆగ్రవర్ణ పార్టీలు వర్గీకరణను సమర్థిస్తున్నారని చెన్నయ్య విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మాలమాహానాడు నాయకులు జి రమేశ్, భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.