జాతీయ వార్తలు

విభజన చట్టంలో ‘హోదా’ చేర్చి ఉండాల్సింది: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: యుపిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చివుంటే బాగుండేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబ్ బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు వస్తోందా? అని ఓ విలేఖరి ప్రశ్నించగా ‘యుపిఏ ప్రభుత్వం అప్పుడే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చివుంటే బాగుండేది’అని అన్నారు. రాజ్యసభలో బిజెపి సవరణ బిల్లుకు మద్దతు ఇస్తుందా? అనే ప్రశ్నకు ఆయన చూడాలి అని సమాధానం ఇచ్చారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుకు బిజెపి మిత్ర పక్షమైన తెలుగుదేశం మద్దతు ఇస్తోందని మరో విలేఖరి ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని వెంకయ్యనాయుడు బదులిచ్చారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బిజెపి వ్యూహం ఏమిటనే ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం ఇవ్వకుండా తనకు తెలియదని చెప్పి వెళ్లిపోయారు.