జాతీయ వార్తలు

హిమాచల్ పైనా బిజెపి కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నిస్తోందని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఆయుధాలుగా వాడుకొని రాష్ట్రంలో అస్థిర పరిస్థితులను సృష్టించడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చాలనేది ఎన్డీయే సర్కారు ధ్యేయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. సోమవారం ఢిల్లీ వచ్చిన వీరభద్ర సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి అనేక అంశాలపై చర్చించారు. అయితే హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్లో నిజం లేదని, చౌకబారు ప్రచారం కోసమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని బిజెపి స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణల విషయంలో జైలుకు వెళ్లకుండా వీరభద్ర సింగ్ తప్పించుకుంటున్నారని, అయితే ఎప్పటికైనా ఆయనకు అది తప్పదని బిజెపి వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటున్న వీరభద్ర సింగ్, తాజాగా తన రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి సోనియాకు సవివరంగా తెలియజేశారు. గతంలో వీరభద్ర సింగ్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు సోనియా అపాయింట్‌మెంట్ దక్కలేదు. అయితే తాజాగా ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుని పది నిమిషాల పాటు ఆమెతో చర్చలు జరిపారు. తనపై దాఖలైన కేసుల గురించి కూడా ఈ సందర్భంగా సోనియాకు వివరించినట్లు కూడా తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకదాని తర్వాత ఒకటిగా కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉదంతాలే నిదర్శనమని అన్నారు. తనను అనేక కేసుల్లో ఇరికించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కూడా ఆరోపించారు.

చిత్రం హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్