జాతీయ వార్తలు

సింగ్ నాలుక కోస్తే రూ.50 లక్షల రివార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 21: బిఎస్పీ అధినేత్రి మాయవతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత దయాశంకర్ సింగ్ నాలుక కోస్తే రూ.50 లక్షలు బహుమతిగా ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ నేత ఆఫర్ ఇచ్చారు. యూపీలో బిఎస్పీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. అయితే సింగ్ నాలుక కోసి తెస్తే 50 లక్షలు ఇస్తామని చండీగఢ్ బిఎస్పీ ఎమ్మెల్యే ఉషా చౌదరి ప్రకటించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్‌పై పార్టీ హైకమాండ్ వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్టు బుధవారం రాత్రే ప్రకటించారు.