జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో వీగిన అవిశ్వాస నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూలై 21: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ బిజెపి సభ్యులు ఇచ్చిన నోటీసులు గురువారం వీగిపోయాయి. అంతకుముందు సభలో ప్రిసైడింగ్ అధికారిని స్పీకర్ ఆహ్వానించిన అంశం రాజ్యాంగబద్ధతపై బిజెపి సభ్యులకు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ‘ప్రజాస్వామ్యం ఖూనీ అయింది’ అని ఆరోపిస్తూ బిజెపి సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత ప్రిసైడింగ్ అధికారి నవప్రభాత్ స్పీకర్‌కు వ్యతిరేకంగా వచ్చిన నోటీసును చర్చకు చేపట్టారు. అయితే అప్పటికే ప్రతిపక్ష బిజెపి సభ్యులు వాకౌట్ చేయడంతో వారు ఇచ్చిన నోటీసుకు అనుకూలంగా మాట్లాడేవారు ఎవరూ లేకుండా పోయారు. ‘అవిశ్వాస నోటీసుకు అనుకూలంగా ఒక్కరు కూడా మాట్లాడకపోవడంతో ఆ నోటీసు వీగిపోయింది’ అని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.