జాతీయ వార్తలు

దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు వామపక్ష మేధావుల యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: వామపక్ష భావజాలాన్ని కలిగివున్న మేథావులు భారతదేశ కీర్తి, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాలిఫోర్నియా (అమెరికా)లోని పాఠ్యపుస్తకాల్లో ‘్భరత్’ను తొలగించి ‘దక్షిణాసియా’ను చేర్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, అయితే హిందూ కార్యకర్తలు అప్రమత్తమై వారి ప్రయత్నాలను భగ్నం చేశారని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయాలంటూ కాలిఫోర్నియా విద్యా విభాగం చేసిన ప్రతిపాదనలు భారతదేశ కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీసేవిగానూ, హిందూ మతానికి చెందిన వాస్తవాలను తొక్కిపెట్టేవిగానూ ఉన్నాయని, దీంతో అమెరికాలోని యువ హిందూ కార్యకర్తలంతా ఏకమై వామపక్ష మేథావుల ప్రయత్నాలను భగ్నం చేశారని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య పేర్కొన్నారు. విశిష్టమైన నాగరికత, సాంస్కృతిక చరిత్రతో భారత్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుందని, దీనిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన భారత్‌ను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించి దాని స్థానంలో దక్షిణాసియాను చేర్చడం సరికాదని, ఈ విషయంలో వామపక్ష మేథావుల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాలిఫోర్నియాలోని హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (హెచ్‌ఇఎఫ్) కార్యకర్తలను అభినందిస్తున్నానని మన్మోహన్ వైద్య తెలిపారు.