జాతీయ వార్తలు

21న సంజాయిషీ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: జెఎన్‌యు క్యాంపస్‌లో అనుమతి లేకుండా మనుస్మృతి ప్రతులను దగ్ధం చేసిన సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ వర్శిటీ ప్రోక్టర్ అయిదుగురు విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు. ‘మార్చి 8న సాయంత్రం 6.30 గంటలకు సబర్మతి దాబా సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు మార్చి 9న చీఫ్ సెక్యూరిటి అధికారి నుంచి చీఫ్ ప్రోక్టర్ కార్యాలయానికి ఒక నివేదిక అందింది’ అని ప్రోక్టర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్చి 21న ప్రోక్టర్ ముందు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులపై దేశద్రోహం అభియోగాలు నమోదు చేసిన తరువాత వర్శిటీకి చెందిన అయిదుగురు ఎబివిపి నాయకులు తమ సంఘంపై తిరుగుబాటు చేసి, మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. ఈ అయిదుగురిలో ముగ్గురు ఎబివిపి ఆఫీస్ బేరర్లు ఆ సంస్థకు రాజీనామా చేసి బయటకు రాగా, మరో ఇద్దరు మాత్రం ఎబివిపిలోనే కొనసాగుతూ మనుస్మృతి విషయంలో ఆ సంస్థ విధానంతో విభేదిస్తున్నారు.