జాతీయ వార్తలు

నక్సలిజాన్ని రూపుమాపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, జూన్ 27: త్వరలోనే దేశంనుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్రం ప్రకటించింది. వామక్ష తీవ్రవాదంవల్ల దేశం ఎంతో నష్టపోయిందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే నక్సల్స్ రహిత రాష్ట్రంగా జార్ఖండ్ ఆవిర్భవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ధీమాగా చెప్పారు. ‘జార్ఖండ్‌లో నక్సలిజం మూలాలు దొరికాయి. అసలు ఆ సమస్యకు కారణం, దాని పరిష్కారం లభించింది’ అని ఆయన స్పష్టం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు ఏర్పాటైన జార్ఖండ్ జగ్వార్ (ప్రత్యేక దళం) పరిపాలన భవనాన్ని ప్రారంభించిన హోమ్ మంత్రి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జాగ్వర్ దళం పనితీరును ఆయన ప్రశంసించారు. వామపక్ష తీవ్రవాదం వల్ల ఒక్క జార్ఖండే కాకుండా దేశం మొత్తం ఎందరి ప్రాణాలనో కోల్పోవాల్సి వచ్చిందని రాజ్‌నాథ్ చెప్పారు. ఏ ఒక్కరూ నక్సలైట్ల దాడిలో చనిపోకూడదన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని ఆయన తెలిపారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా దళాలకు అదనపు వౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక వౌలిక సదుపాయాల పథకం (ఎస్‌ఐఎస్) రద్దుపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితమే ఈ పథకాన్ని రద్దుచేశారు. నక్సల్స్ బాధిత రాష్ట్రాల్లో పోలీసులకు వౌలిక సదుపాయల కల్పన అలాగే రద్దయిన ఎస్‌ఐఎస్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో మాట్లాడానని, వారు స్పష్టమైన హామీ ఇచ్చారని హోమ్‌మంత్రి వెల్లడించారు. దేశంలో మావోయిస్టుల ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, అందులోని ప్రధాన గ్రూపులు ఉనికి కోల్పోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పేద వర్గాలకోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే మావోయిస్టుల సిద్ధాంతమని రాజ్‌నాథ్ విమర్శించారు. పేదలకు వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే అది నక్సలైట్లేనని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల అణచివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యతిరేకులు, పేద వర్గాల వ్యతిరేకులు అని ఆయన దుయ్యబట్టారు. మావోయిస్టుల అణచివేతలో జార్ఖండ్ డిజిపి డికె పాండే చేపట్టిన చర్యలను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.

చిత్రం రాంచీలో సోమవారం నక్సల్స్ దాడుల్లో అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నకేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్