జాతీయ వార్తలు

శాంతి చర్చలు సఫలం కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే శాంతి చర్చలు సఫలం కావని పాకిస్తాన్‌ను ఉద్దేశించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పాకిస్తాన్‌తో భారతదేశం సత్సంబంధాలే కోరుకుంటోందన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ దేశంలో పర్యటించి, ఆ దేశ ప్రధానిని కూడా మన దేశానికి ఆహ్వానించారని వెంకయ్య గుర్తుచేశారు. పాకిస్తాన్ రాయబారి వ్యాఖ్యలు అర్థ రహితమని కొట్టిపారేశారు. తీవ్రవాదానికి కులం, మతం, ప్రాంతం అనేది ఉండదని అన్నారు. మరోవైపు ఎన్‌ఎస్‌జీ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో కృషిచేస్తుంటే, వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు.