జాతీయ వార్తలు

వృద్ధుడిపై ఎంపీ దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మార్చి 27: గుజరాత్‌లోని పోరుబందర్ బిజెపి ఎంపి విఠల్ రాడాడియా ఓ వృద్ధుడ్ని పదే పదే కాలితో తన్నుతూ వీడియోకు చిక్కడం, అది సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించడంతో ఆయనకు చిక్కులు మొదలైనాయి. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న రాడాడియా టెంటులో చివరి వరసలో కూర్చుని ఉన్న ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి పదే పదే కాలితో తన్నడం ఆ వీడియో దృశ్యాల్లో ఉంది. తన సిగ్నేచర్ ఉన్న షర్టు, తెల్ల ప్యాంట్ ధరించిన రాడాడియా వృద్ధుడ్ని తన్నుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ, ఎప్పుడు జరిగిందో మాత్రం అందులో లేదు. అయితే రాడాడియా మాత్రం తాను వృద్ధుడ్ని తన్న లేదని, అక్కడినుంచి వెళ్లిపొమ్మని మాత్రమే చెప్పానని అంటున్నారు. రాడాడియా ఆ వృద్ధుడికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకుని బయటికి వెళ్లకపోతే అంతు చూస్తానని బెదిరిస్తూ ఉన్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది. రాడాడియాకు వివాదాలు కొత్తేమీ కాదు. 2012లో వడోదర సమీపంలోని ఓ టోల్ గేట్ సిబ్బందిని రైఫిల్‌తో బెదిరిస్తూ వీడియోకు చిక్కడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉండిన ఆయన తన కారులోంచి రైఫిల్‌తో బైటికి వచ్చి గుర్తింపు పత్రం చూపించమని అడిగిన టోల్ గేట్ సిబ్బందిని చంపేస్తానని బెదిరించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దాడి చేయడం లాంటి సంఘటనలకు సంబందించి రాడాడియాపై పలు కేసులు కూడా ఉన్నాయి.