జాతీయ వార్తలు

ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ అమలవుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దినేశ్ మొహానియాను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు అరెస్టు చేయడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడు కూడా అయిన మొహానియా దక్షిణ ఢిల్లీలోని ఖాన్పూర్‌లో గల తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగా శనివారం మధ్యాహ్నం సుమారు 12.10 గంటలకు ఒక పోలీసు అధికారి సీటులోనుంచి లాగి అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసులో అతడిని అరెస్టు చేశారు. అన్ని టివి కెమెరాల ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మొహానియాను అరెస్టు చేయడం ద్వారా ప్రధాని మోదీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని కేజ్రీవాల్ నిలదీశారు. 2015 ఫిబ్రవరిలో ఆప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 8వ ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మొహానియా అని ఆయన పేర్కొన్నారు. నీటి సమస్యపై తనకు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలపై మొహానియా లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.

చిత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్ మొహానియాను అరెస్టు చేస్తున్న పోలీసులు