జాతీయ వార్తలు

మే, మార్చి నెలల్లోనే అధిక రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మే, మార్చి నెలలు అత్యంత క్రూరమైన నెలలుగా నిలిచాయి. గత రెండేళ్లలో ప్రతి సంవత్సరం మే, మార్చి నెలల్లోనే సుమారు 18 శాతం రోడ్డు ప్రమాదాలు జరగడం విశేషం. నిరుడు ఒక్క మే నెలలోనే దేశంలో 46,247 రోడ్డు ప్రమాదాలు జరిగి, 14వేలకు పైగా మంది దుర్మరణం పాలయ్యారు. 47వేల మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. 2015లో అయిదు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించి, 1.46 లక్షల మంది మృతి చెందారు. అయిదు లక్షలకు పైగా మంది గాయపడ్డారు. ఈ మొత్తం ప్రమాదాల్లో ఒక్క మే నెలలోనే తొమ్మిది శాతం ప్రమాదాలు జరిగాయి. మే తరువాత క్రూరమైన నెలగా మార్చి నిలిచింది. 2015 మేలో 46,247 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, మార్చిలో 42,842 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే మేలో 9.2 శాతం ప్రమాదాలు జరుగగా, మార్చి 8.5 శాతం ప్రమాదాలు జరిగాయని ‘్భరత్‌లో రోడ్డు ప్రమాదాలు’ అనే అంశంపై రూపొందించిన తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. 2014లోనూ పరిస్థితి ఇలాగే ఉందని ఆ నివేదిక తెలిపింది. 2014 మేలో అత్యధికంగా 45,404 రోడ్డు ప్రమాదాలు జరుగగా, మార్చిలో 42,524 ప్రమాదాల జరిగాయి. అంటే మేలో 9.2 శాతం, మార్చిలో 8.6 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
ఎక్కువ ప్రమాదాలు సాయంత్రం 3గంటల నుంచి 6గంటల మధ్య జరిగాయని కూడా ఈ నివేదిక తెలిపింది. ఈ సాయంత్రం సమయాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 17.3 శాతంతో 86,836 జరిగాయని నివేదిక తెలిపింది. తెల్లవారు జామున ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయనేది చాలా మంది భావన. కాని, రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల మధ్య అతి తక్కువగా 27,954 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనే భావన కూడా సరికాదని ఈ నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 2,31,894 ప్రమాదాలు జరుగగా, గ్రామీణ ప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువ 2,69,529 ప్రమాదాలు జరిగాయని ఈ నివేదిక వెల్లడించింది.