జాతీయ వార్తలు

హేమకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, జూన్ 4: సొంత నియోజకవర్గం మధురలోని జవహార్‌బాగ్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన బిజెపి ఎంపీ హేమమాలినికి పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. జవహార్‌బాగ్‌లో కూంబిం గ్ ఆపరేషన్ జరుగుతున్నందున ప్రజ లు ఎవరినీ అక్కడికి వెళ్లనీయడం లేదని వారన్నారు. ‘ఎంపీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని సమస్యగా చిత్రీకరించొద్దు. పోలీసు అధికారులు, నిపుణులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందుకే ఎవర్నీ అనుమతించడం లేదు’ అని అధికారులు చెప్పారు. జవహార్‌బాగ్‌లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదని, ఆ ప్రాంతాన్ని అప్పుడే సురక్షితమైందిగా చెప్పలేమని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఓ పక్క మధుర అట్టుడికిపోతుంటే తన షూటింగ్ ఫోటోలు ట్విట్టర్‌లో పోస్టుచేసిన ఎంపీ హేమమాలినిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. వెంటనే ట్విట్టర్‌లోంచి సినిమా ఫోటోలు తీసేసిన ఎంపీ మధుర ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడకు వచ్చిన ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎస్పీ సంతోష్ యాదవ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫరాల మృతికి సంతాపం తెలిపారు.