జాతీయ వార్తలు

మహారాష్ట్ర మంత్రి ఖడ్సే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 4: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, పుణెలో భూమి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు లాంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమన్న సామీతో నరేంద్ర మోదీ-అమిత్‌షా ద్వయం అదికారం చేపట్టిన తర్వాత బిజెపికి చెందిన ఓ మంత్రి అవినీతి ఆరోపణలపై పదవికి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి. పదవినుంచి తప్పుకోకపోతే తామే చర్య తీసుకుంటామంటూ పార్టీ అధిష్ఠానంనుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో శనివారం ఉదయం ఖడ్సే నేరుగా ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ నివాసానికి వెళ్లి మంత్రిపదవికి రాజీనామా సమర్పించారు. ఖడ్సే రాజీనామాను ఆమోదించి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు పంపిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఖడ్సే కోరినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరిపించనున్నట్లు ప్రకటించారు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో నంబర్‌టూగానే కాకుండా రెవిన్యూ, వ్యవసాయం లాంటి కీలక శాఖలను నిర్వహిస్తున్న ఖడ్సేపై ఇటీవలి కాలంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనుంచి ఖడ్సే ఫోన్‌కు కాల్స్ వచ్చినట్లు ఇటీవల ఓ న్యూస్ చానల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే పుణెలో మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 40 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఖడ్సే తన పలుకుబడి ఉపయోగించి ఆ భూమి అసలు యజమానినుంచి తన భార్య, అల్లుడి పేరిట కేవలం 3.75 కోట్లకే కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఖడ్సే ఖండించినప్పటికీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలాంటి ప్రతిపక్షాలతో సహా మిత్రపక్షమైన శివసేన సైతం ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించాలని డిమాండ్ చేయసాగాయి. దీంతో ఫడ్నవిస్ గురువారం ఢిల్లీవెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలను కలిసి ఖడ్సే వ్యవహారంపై ఒక నివేదికను సమర్పించడంతో ఖడ్సే పదవినుంచి తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది.