జాతీయ వార్తలు

తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాల ఎన్నికలను రద్దు చేసిన ఇసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: తమిళనాడులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి రాబోయే రోజుల్లో తాజాగా మళ్లీ నిర్వహించాలని కేంద్ర ఎన్నిల సంఘం శనివారం నిర్ణయించింది. ఎన్నికల కోసం ఒకసారి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం. తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 16న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంచిపెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం అరవకురిచ్చి, తంజావూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలను 16నుంచి 23వ తేదీకి మొదట వాయిదా వేసింది. ఆ తర్వాత ఇసి ఈ నెల 21న మరోసారి ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలను జూన్ 13కు వాయిదా వేసింది. తమిళనాడులో ఈ నెల 16న జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల పరిశీలకులు, కేంద్ర పరిశీలకుల బృందాలు, ఈ రెండు నియోజకవర్గాలకోసం నియమించిన ప్రత్యేక పరిశీలకుల బృందాల నివేదికలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇసి తెలియజేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు, బహుమతులతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభపెట్టడంతో వాతావరణం తీవ్రంగా కలుషితమైందని, అందువల్ల అక్కడ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నిలు నిర్వహించడం మంచిదని ఇసి భావించిదని ఇసి ఉత్తర్వును ఉటంకిస్తూ ఓ అధికారి చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి కండబలాన్ని ఉపయోగించినట్లు సాక్ష్యాధారాలున్నప్పుడు ఇసి సాధారణంగా ఎన్నికలను రద్దు చేయడంలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు సంచులను ఉపయోగించినట్లు ఆరోపణల కారణంగా ఎన్నికలను రద్దు చేయడమనేది ఇప్పటివరకు జరగలేదు.