జాతీయ వార్తలు

నీట్ ఆర్డినెన్స్‌పై సుప్రీంలో సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను అన్ని రాష్ట్రాల్లోనూ నీట్ అమలును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ఒకటి రెండు రోజుల్లో వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఇండోర్‌కు చెందిన వైద్యుడు ఆనంద్‌రాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల రాష్టప్రతి ఆమోదం పొందిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దుచేయడంతోపాటు తాత్కాలిక ఉపశమనంగా అమలును నిలిపివేయాలని కూడా పిటిషనర్ అభ్యర్ధించారు.నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. కేవలం నాలుగువారాల వ్యవధిలోనే కేంద్రం తన వైఖరి మార్చుకుని ఈ ఆర్డినెన్స్ జారీ చేసిందని స్పష్టం చేశారు. మరో ఎనిమిది వారాల్లో పరీక్షల షెడ్యూల్ ప్రారంభం కానున్న తరుణంలో కేంద్రమే ఈ రకమైన ఆర్డినెన్స్ జారీచేశారని ఆనంద్‌రాయ్ కోర్టుకు తెలిపారు.