జాతీయ వార్తలు

నేను ప్రధాన మంత్రిని కాను ..ప్రధాన సేవకుడిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహరాన్‌పూర్, మే 26: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో 125కోట్ల మంది భారతీయులకు సదా సేవలందిస్తూ వచ్చానని ప్రకటించిన మోదీ ‘నేను ప్రధానిని కాదు.. మీ ప్రధాన సేవకుడ్నే. అలాగే కొనసాగుతా..’నని పునరుద్ఘాటించారు. బిజెపి సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి వెల్లడించారు. యూపీఏ హయాంలో నెలకొన్న నిస్సహాయతను పారదోలి అభివృద్ధిని, సరికొత్త ఆశలను ఎన్డీయే ప్రభుత్వం పాదుగొల్పిందన్నారు. ప్రభుత్వ నిధుల దోపిడీని అరికట్టామని చెప్పారు. వచ్చే నెల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యూపీలో పలు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రైతుల సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడే యూపీవాలాగా తనను అభివర్ణించుకున్న మోదీ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు రావచ్చు.. పోవచ్చునని కానీ ఎన్నికలు మాత్రం శాశ్వతంగా నిర్ణీత కాల వ్యవధిలో జరుగుతూనే ఉంటాయన్నారు. కేవలం ప్రజలకు అన్ని విధాలుగా సేవలందించేందుకే ఏ ప్రభుత్వమైనా ఏర్పాటవుతుందని పేర్కొన్న మోదీ ‘గత రెండేళ్ల కాలంలో మా ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనించారు. పేదల సేవకే అంకితమవుతామన్న మాటకు కట్టుబడి అనేక సంక్షేప పథకాలను చేపట్టాం..అందరి ఆశలకు అనుగుణంగా పనిచేశాం’అని తెలిపారు. ప్రజలకు అంకితభావంతో సేవలందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేసేందుకే కృషి చేస్తున్నామన్నారు.తాను కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి రాష్ట్రాల ఇబ్బందులేమిటో తెలుసునన్నారు. కేంద్ర ఖజానాకు 35శాతం నిధులు మాత్రమే చెందుతాయని, మిగతాదంతా రాష్ట్రాల వాటానేనని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశం మారుతున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం మారడం లేదన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారుల నిర్మాణానికి విశేష ప్రాధాన్యతనిచ్చామని.. ఆ విధంగా పేదల జీవితాల్లో గుణాత్మక పరివర్తనను తీసుకొచ్చామని మోదీ తెలిపారు. చెరకు రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని, చక్కెర పరిశ్రమలు నిజాయితీగా పనిచేస్తే ఏ రైతుకూ అన్యాయం జరగదన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని చక్కెర మిల్లులను ప్రధాని హెచ్చరించారు. అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ రెండేళ్ల క్రితం ఈ జాడ్యం పరాకాష్టకు చేరుకుందని..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి అవినీతి ఆరోపణా రాలేదన్నారు. గత ప్రభుత్వం దేశ సంపదనంతా కొల్లగొట్టిందంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై మోదీ విరుచుకు పడ్డారు. మహిళలకు సాధికారత కల్పించామని, బేటీ బచావ్..బేటీ పడావ్ ద్వారా బాలికలకు అండగా నిలిచామన్నారు. భారత దేశంలో బాలికలకు సాధికారత కల్పించక పోతే భారత దేశం ఎలా నిర్మితమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ధనికుల కోసం కాదని, పేదల కోసమేనని స్పష్టం చేస్తూ ‘దీని వల్ల పరిసరాలు పరిశుభ్రమవుతాయి. పేదలకు రోగాల బారిన పడే ప్రమాదం ఉండదు’అని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం రెండింతలైందన్నారు. గ్రామాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్న ఆయన ‘దేశంలో 18వేల గ్రామాల్లో ఒక్క విద్యుత్ స్తంభం కూడా లేకపోవడం సిగ్గుచేటు..’అని తెలిపారు. దేశంలో వంద కోట్ల మంది విద్యుత్ సబ్సిడీని స్వచ్ఛంగా వదులుకోవడం తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా పేర్కొన్నారు. దేశంలోని యువత ఉద్యోగాలను పొందాల్సిందేనని వెల్లడించిన మోదీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తేజోవంతగా ఉన్న ఏకైన దేశం భారతావనేనంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘నేను ఏమి చేసినా దానిపై నిఘా ఉంటుంది. ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి సెకనుకు, ప్రతి రూపాయికీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిందే..’నని ఉద్ఘాటించారు.