జాతీయ వార్తలు

నిర్భయ నిధి కంటితుడుపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: అత్యాచార బాధిత మహిళల కోసం నిర్భయ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధి కంటితుడుపుచందంగానే ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిర్బయ నిధి ఏ మాత్రం సరిపోనందున బాధిత మహిళలకు పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించేందుకు జాతీయ స్థాయిలో పరిహార విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అత్యాచార కేసుల్లో బాధితులకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉందని..జాతీయ విధానమంటూ ఇప్పటి వరకూ ఏమీ లేదని న్యాయమూర్తులు పిసి పంత్, డివై చంద్రచూడ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 357(ఎ)ను ఇప్పటి వరకూ ఏ విధంగా అమలు స్థితిగతులు, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు పథకాల వివరాలు, ఇప్పటి వరకూ ఎంత మంది బాధితులకు పరిహారం చెల్లించారో తెలియజేస్తూ తమకు నివేదిక అందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బాధితులకు నష్ట పరిహార చెల్లింపు పథకం కంటితుడుపుగా మారిందని, మొత్తం 29 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాలు మాత్రమే దీన్ని నోటిఫై చేశాయని సీనియర్ అడ్వకేట్ ఇంద్రా జైసింగ్ కోర్టుకు నివేదించారు. ఈ పథకాల్లో ఏకోశానా సారూప్యత లేదని, ఇందుకోసం నిధులు కేటాయించిన విషయాన్నీ సంబంధిత రాష్ట్రాలు వెల్లడించలేదని తెలిపారు. అసలు బాధితులకు ఏ మేరకు పరిహారాన్ని చెల్లించారో కూడా తెలియకుండా పోయిందన్నారు. కొన్ని రాష్ట్రాలు అత్యాచార బాధిత మహిళలకు పది లక్షల పరిహారం చెల్లిస్తూంటే మరి కొన్ని రాష్ట్రాలు కేవలం 50వేల రూపాయలే చెల్లిస్తున్నాయన్నారు.