జాతీయ వార్తలు

రొట్టెల్లో... రసాయనాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ ప్రేరక రసాయనాలు వాడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వాటి వాడకాన్ని ఆపుతున్నట్లు అఖిల భారత బ్రెడ్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుంచి పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ వంటి పదార్థాల వాడకాన్ని బ్రెడ్ ఉత్పత్తుల్లో వాడటాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దేశ రాజధానిలో అమ్ముడవుతున్న బ్రెడ్ ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం కేన్సర్‌కారక రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రత నియంత్రణ సంస్థ నివేదికలో పేర్కొనటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆరేడు రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా వెల్లడించింది. అయితే నిర్ణయం మాత్రం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై సరైన శాస్త్ర పరిశోధన జరగాల్సి ఉందని సంస్థ అభిప్రాయపడింది. ఆహార భద్రత నియంత్రణ సంస్థ ప్రచురించిన పుస్తకంలో 11వేల పదార్థాలలో సదరు రసాయనాన్ని వాడవచ్చని పేర్కొందని.. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించటం ముఖ్యమని వివరించింది. నిషేధిత రసాయనాల స్థానంలో ఎంజైమ్‌ల వంటివి ఉపయోగిస్తామని ప్రకటించింది.