జాతీయ వార్తలు

ఇటలీ మెరైన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: కేరళలో ఇద్దరు భారతీయ జాలర్లపై కాల్పుల ఘటనలో ఇటాలియన్ మెరైన్ సాల్వెటోర్ గిరోనే స్వదేశం వెళ్లేందుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. 2012లో కేరళ తీరంలో ఇద్దరు భారతీయ జాలర్లపై ఇటవీ నౌకాసిబ్బంది కాల్పులు జరిపారు. మిస్సిమిలియానో లట్టోరే, సాల్వెటోర్ గిరోనేలపై అభియోగాలు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లక్టోరే ఆరోగ్య వైద్య పరీక్షలకని ఇటలీ వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ సుప్రీం కోర్టు అతడికి అనుమతి ఇచ్చింది. తాజాగా వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు పిసి పంత్, డివై చంద్రచూడ్ గురువారం కేసు విచారించి గిరోనేకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. భారత-ఇటలీ మధ్య తల్తెత్తిన ఈ వివాదం ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉందని ఆ దేశ రాయబారి స్పష్టం చేశారు. గిరోనే స్వదేశం వెళ్లడానికి అనుమతి ఇచ్చిన కోర్టు నాలుగు షరతులు విధించింది. నిందితుడు నెలలో మొదటి బుధవారం ఇటలీలో పోలీసు స్టేషన్ వెళ్లి రిపోర్టు ఇవ్వాలి. అదే విషయాన్ని ఇటలీలోని భారత ఎంబసీకి సమాచారం ఇవ్వాలి. కేసులో సాక్షులను ప్రలోభపెట్టడం, సాక్షాలను తారుమారు చేయడానికి నిందితుడు ప్రయత్నించకూడదని కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలని, ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని సుప్రీం కోర్టు షరతులు పెట్టింది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) పిఎస్ నరసింహ కోర్టుకు స్పష్టం చేశారు.