జాతీయ వార్తలు

స్పైస్‌జెట్ విమానంలో కిలో బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: కోచీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం లావెట్రీలో కిలో బంగారాన్ని సిబ్బంది కనుగొన్నారు. దుబాయి నుంచి వచ్చిన ఈ విమానం విమానాశ్రయంలో దిగగానే తనిఖీల్లో ఇది బయటపడింది. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూస్ పేపర్‌లో చుట్టిన కిలో బరువైన బంగారం కడ్డీలు లావెట్రీలోని టిస్యూ బాక్స్ కింద దాచి ఉంచారు. స్పైస్‌జెట్ ఎస్‌జి-18 దుబాయి-కోచీ విమానంలో మంగళవారం ఇది చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు.
విమానం ఎగురుతున్న సమయంలో లావెట్రీ మూసినట్టు, తెరిచినట్టు శబ్దం రావడంతోపాటు ఓ ప్రయాణికుడి కదలికపై సిబ్బందికి అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుడు కొరియర్ అయి ఉంటాడని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు.