జాతీయ వార్తలు

జాట్లకు కోటా కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మే 26: హర్యానాలో జాట్లకు, మరో అయిదు కులాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంఎల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం నిలిపివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జాట్లకు, మరో అయిదు కులాల వారికి పదిశాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రవేశపెట్టిన హర్యానా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల చట్టం- 2016ను హర్యానా శాసన సభ మార్చి 29న ఏకగ్రీవంగా ఆమోదించిన దాదాపు రెండు నెలల తర్వాత హైకోర్టు ఈ నిర్ణయాన్ని నిలిపివేయడం గమనార్హం. భివానీకి చెందిన మురళీ లాల్ గుప్తా అనే అతను ఈ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కెసి గుప్తా కమిషన్ సిఫార్సుల ఆదారంగా జాట్లకు రిజర్వేషన్లు కల్పించారని, అయితే ఆ నివేదికను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని గుప్తా తన పిటిషన్‌లో వాదించారు. జాట్ల డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం జాట్లతో పాటుగా మరో అయిదు కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకురావడం, అసెంబ్లీ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం తెలిసిందే.