జాతీయ వార్తలు

స్పేస్ షటిల్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 23: రాకెట్ ప్రయోగాల్లో విప్లవం సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన స్పేస్ షటిల్ ప్రయోగం తొలి అడుగులోనే ఘన విజయం సాధించింది. రోదసీ పరిశోధనల్లో భారత తివర్ణపతాకం మరోసారి రెపరెపలాంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ చేపట్టిన పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ షటిల్ ప్రయోగాల్లో అమెరికా, రష్యా తరువాతి స్థానం భారత్ సంపాదించింది. నెల్లూరు జిల్లాలోని భారత్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి సోమవారం ఉదయం 7 గంటలకు చేపట్టిన ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్ ప్రయోగం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు కౌంట్‌డౌన్ ప్రారంభమై ఆరు గంటలు నిర్విఘ్నంగా కొనసాగిన అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పునర్వినియోగ వాహక నౌక (ఆర్‌ఎల్‌వి-టిడి) సరిగ్గా సోమవారం ఉదయం 7గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగివైపు కదిలింది. రోదసిలో రాకెట్ 70 కిలోమీటర్ల దూరం పయనించిన ఆర్‌ఎల్‌వీ మళ్లీ భూ స్థిర కక్ష్యలోకి చేరింది. భూమి నుండి 70 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన అనంతరం రాకెట్ తిరిగి అండమాన్ నికోబార్ దీవుల్లో షార్‌కు 500 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై నెమ్మదిగా దిగింది. భూమిపైకి ఎగిరిన అనంతరం ధ్వనికంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో రాకెట్ దూసుకెళ్లడంతో 11 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తయింది. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్, షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ కలిసి గమనించారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ తిరిగి భూస్థిర కక్ష్యలోకి సురక్షితంగా పునఃప్రవేశం చేయడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇస్రో చైర్మన్ శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని ఆనందాన్ని పంచుకొని రాకెట్ విజయవంతమైందని ప్రకటించారు.

స్పేస్ బిజినెస్‌లో కీలకం
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ షటిల్ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ బిజినెస్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది. నాడు బుడిబుడి అడుగులు వేస్తూ చిన్న ప్రయోగాలతో ప్రారంభించి నేడు భారీ ప్రయోగాలు చేపట్టే స్థాయికి మన శాస్తవ్రేత్తలు ఎదిగారు. ఒకప్పుడు క్రయోజనిక్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన ఇస్రో తానే క్రయోజనిక్ రూపొందించింది. ఆ తరువాత నావిగేషన్‌లోనూ సక్సెస్ సాధించింది. ఇప్పుడు తక్కువ ఖర్చుతో స్పేస్ షటిల్ రూపొందించి విజయం సాధించటంతో అంతరిక్ష వ్యాపారంలో అగ్రరాజ్యాలతో దీటుగా పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంది. దీనివల్ల రాకెట్ ప్రయోగ ఖర్చులు పదిరెట్లు తగ్గడమే కాకుండా ప్రయోగాలకు వాడిన పరికరాలను మళ్లీ మళ్లీ వాడుకొనే వీలుంటుంది. వ్యోమగాములను కూడా అంతరిక్షంలోకి పంపి మళ్లీ క్షేమంగా భూమి మీదకు తీసుకురావచ్చు.
మొదట 8గంటలు కౌంట్‌డౌన్ ప్రారంభించి 9:30గంటలకు ప్రయోగం చేపట్టేందుకు శాస్తవ్రేత్తలు నిర్ణయం తీసుకొన్నారు. ప్రతికూల వాతావరణంతో ఇస్రో చైర్మన్ ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చించి కౌంట్‌డౌన్‌ను 2గంటలు కుదించి ఉదయం 7గంటలకు ప్రయోగించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ప్రయోగానికి రూ.92కోట్లు ఖర్చు చేశారు.

రాకెట్ పయనం ఇలా..
6.5మీటర్ల పొడవు, 1.75టన్నుల బరువుగల ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్ రెండు దశల ఇంజన్లతో ప్రయోగించిన రాకెట్ తొలి దశలో ఘన ఇంధనంతో పనిచేసే ఎస్-9 మోటారుతో 110సెకన్లతో 45కి.మీ ఎత్తుకు చేరింది. రాకెట్‌ను వేగంగా నెట్టిన అనంతరం మొదటి దశ మోటారు విడిపోయింది. రెండు పక్కల విమానం వలే రెక్కలు కలిగిన ఈ రాకెట్ మరో 23కి.మీ ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడ నుండి రాకెట్ నెమ్మదిగా 70కి.మీ ఎత్తుకు చేరి తిరిగి భూమి పైకి పునఃప్రవేశించింది. అనుకొన్న ఎత్తులోకి చేరిన అనంతరం శాస్తవ్రేత్తలు రాకెట్ వేగాన్ని తగ్గించి షార్‌కు 420కి.మీ దూరంలోని బంగాళాఖాతంలో ఉన్న వర్చ్యువల్ రన్‌వే పై దింపారు. సముద్ర మట్టానికి 10కి.మీ ఎత్తుకు చేరుకొన్న తర్వాత రాకెట్ సముద్రంపై కొంత దూరం ప్రయాణించింది. వర్చ్యువల్ రన్‌వేకు 30కి.మీ దూరంలో చెన్నై పోర్టు నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన నౌకలో ఏర్పాటు చేసిన రాడార్ల ద్వారా రాకెట్ పనితీరును శాస్తవ్రేత్తలు పరిశీలించారు. అనంతరం రాకెట్ సముద్ర జలాల్లో కలిసే విధంగా రూపొందించారు. గతంలో ఇలాంటి తరహా ప్రయోగాలు చేసిన అమెరికా, రష్యా, జపాన్‌లకు అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇస్రో ఇదే ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేపట్టి పూర్తిస్థాయిలో వాహక నౌకను సిద్ధం చేసేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది.

చిత్రం షార్ ప్రయోగ వేదికపై నుంచి ఆకాశంలోకి దూసుకెళ్తున్న స్పేస్ షటిల్ రాకెట్