జాతీయ వార్తలు

అమ్మ.. మాటంటే మాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 23: పురచ్చితలైవి జయలలిత తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. తమిళనాడులో మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించిన జయలలిత సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల్లో తానిచ్చిన ప్రధానమైన అయిదు హామీలనూ నెరవేర్చారు. రాష్ట్రంలో రైతులందరికీ 2016 మార్చి 31నాటి వరకు సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ తొలి ఫైలుపై ఆమె సంతకం చేశారు. పంట రుణాలు, మధ్య, దీర్ఘకాలిక రుణాలతోపాటు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన రుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మాఫీ వల్ల దాదాపు రూ.5780 కోట్ల భారాన్ని జయ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. తమిళనాడులో గృహ వినియోగదారులకు వంద యూనిట్ల వరకూ విద్యుత్తును ఉచితంగా ఇచ్చే ఫైలుపై జయ రెండో సంతకం చేశారు. చేనేత రంగంలో హ్యాండ్‌లూమ్స్‌కి రెండు వందల యూనిట్లు, పవర్‌లూమ్స్‌కి 750 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పరిమితిని పెంచారు. ఇక మహిళలకు మంగళసూత్రం స్కీంలో భాగంగా ఇప్పుడిస్తున్న బంగారాన్ని 8 గ్రాములకు పెంచుతూ మూడో ఫైలుపై సంతకం చేశారు. మంగళసూత్రంతోపాటు వారికిచ్చే ఆర్థిక సహాయ మొత్తాన్ని రూ.25వేల నుంచి 50వేల వరకు పెంచారు. ప్రభుత్వం అధ్వర్యంలో నడిచే 500 మద్యం అవుట్‌లెట్లను మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులు, బార్లు ఉదయం 10 నుంచి రాత్రి పది వరకే నడవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
28మందితో కొలువుతీరిన జయ
ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ఆరోసారి ప్రమాణం చేశారు. మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో గవర్నర్ కొణిజేటి రోశయ్య జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. జయ తరువాత ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడు ఓ.పన్నీర్ సెల్వం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయతోపాటు 28మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బుధవారం మరో నలుగురు ప్రమాణం చేయనున్నారు. గత కేబినెట్‌లోని పదిహేను మంది మంత్రులకు తిరిగి మంత్రి పదవులు దక్కాయి. ముగ్గురు మహిళలతోపాటు కొత్తగా 13మందికి అవకాశం లభించింది. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై, జయలలిత సహచరి శశికళ, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయతే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు అంటే మే 23, 2015న జయలలిత అయిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో జయ ప్రమాణం చేశారు. సరిగ్గా ఏడాది తరువాత మళ్లీ ఇదేరోజు ప్రమాణం చేయటం విశేషం.

చిత్రం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జయలలిత
మంత్రులుగా సామూహిక ప్రమాణం చేస్తున్న ఆమె మంత్రివర్గ సహచరులు