జాతీయ వార్తలు

జైలుకెళ్లానన్న చింత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్ జరిగిన సంఘటనపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయలేదు. తిహార్ జైలునుంచి విడుదలైన తరువాత మాట్లాడుతూ ‘జైలుకు వెళ్లినందుకు నేనేమీ చింతించడం లేదు. గర్విస్తున్నాను’ అని ప్రకటించాడు. ‘మాపై బనాయించిన ఈ కేసులో జైలుకెళ్లినందుకు మేం ఏమీ బాధపడడం లేదు. ఒక విధంగా గర్వంగా భావిస్తున్నాం’ అని విద్యార్థుల సమూహంతో మాట్లాడుతూ చెప్పాడు. అరుంధతీ రాయ్, వినాయక్ సేన్‌లాంటి వారిపైనా దేశద్రోహం కేసు పెట్టిన విషయాన్ని ఖలీద్ ప్రస్తావించాడు. ‘మా గొంతులు నొక్కడానికే మా పేర్లు చేర్చి జైలుకు పంపారు’ అని ఖలీద్ ఆరోపించాడు. బావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం పొంచి ఉందని తాను భావించడం లేదని, అదేదైనా ఉంటే అధికారంలో ఉన్నవారికేనని అన్నాడు. జైలు నుంచి విడుదలైన ఖలీద్‌కు జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ తదితరులు ఘనస్వాగతం పలికారు.
పోరు ఆపొద్దు: సారా
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఎస్‌ఎఆర్ జిలాని, జిఎన్ సాయిబాబాపై మోపిన దేశద్రోహం కేసులను ఎత్తివేసేదాకా పోరాటాన్ని ఆపొద్దని ఉమర్ ఖలీద్ చెల్లెలు 11ఏళ్ల సారా ఫాతిమా పిలుపునిచ్చారు. దేశద్రోహం అభియోగాలను ఎదుర్కొంటున్న ఉమర్, అనిర్బన్ భట్టాచార్య మధ్యంతర బెయిలుపై జైలునుంచి బయటకు వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలికిన సారా ఫాతిమా అనంతరం జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.