జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, మే 23: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఉగ్రవాదులు ఒక పోలీసు పార్టీపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారు. జమ్మూకాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేర్పాటువాద గెరిల్లాలు పెద్దదాడికి తెగబడటం ఇదే మొదటిసారి. ఈ దాడికి తామే పాల్పడినట్లు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ప్రకటించుకుంది. తమ సంస్థ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ అధికార ప్రతినిధి ఒకరు శ్రీనగర్‌లోని ఒక వార్తాసంస్థకు చెప్పారు. పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడటానికి సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నియంత్రణ రేఖ వెంట హైఅలర్ట్ ప్రకటించారు.
భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు సోమవారం తొలుత శ్రీనగర్‌లోని జదిబల్ పోలీసు స్టేషన్ వద్ద గల ఒక పోలీసు పార్టీపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎఎస్‌ఐ నజీర్ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ మృతి చెందారు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఉగ్రవాదులను పోలీసు పార్టీ ఆపడానికి ప్రయత్నించగా వారు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఒక అధికారి తెలిపారు. ఈ దాడి తరువాత ఉగ్రవాదులు పారిపోయారు. శ్రీనగర్‌లోని జదిబల్, తెంగ్‌పొరలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదలిపెట్టబోమని, ఆర్మీ, పోలీసు, ఇతర భద్రతా సంస్థలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని 15 కాప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ సతీశ్ దువా చెప్పారు.

చిత్రం ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పిస్తున్న కాశ్మీర్ డిజిపి రాజేంద్ర కుమార్