జాతీయ వార్తలు

ఆస్కార్‌కు వెళ్తే రూ.కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: భారతీయ సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పోటీలకు వెళ్లే సినిమాల కోసం ఓ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రానికి కోటి రూపాయలు, కేన్స్, వెనీస్ అవార్డులకు పోటీపడే చిత్రానికి 50 లక్షల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో షూటింగ్‌లు ప్రోత్సంచాలని నిర్ణయించారు. దీనికోసం విదేశీ చలన చిత్ర సంస్థలను దేశంలోకి ఆహ్వానించాలని యోచిస్తున్నారు. విదేశీ దర్శకులకోసం ప్రత్యేక కేటగిరి కింద వీసాల జారీకి కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖను కోరనున్నట్టు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు. భారతీయ చిత్రాలు అంతర్జాతీయ పోటీని తట్టుకుని అవార్డులు సంపాదించేందుకు వీలుగా అనేక ప్రోత్సాహకాలు ప్రవేశపెడుతున్నట్టు సోమవారం చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత చిత్రాల ప్రదర్శన, బృందాల పర్యటనకు సహకారం అందించాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రానికి కోటి రూపాయలు, కేన్స్, వెనీస్ చిత్రోత్సవాలకు వెళ్లే వాటికి 50 లక్షల రూపాయలు ప్రోత్సహకం ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకుంటే ఆ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.