జాతీయ వార్తలు

బెంగాల్ రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకుంటోంది. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, బిజెపిని మట్టికరిపించేందుకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పన్నిన వ్యూహం ఫలించింది. మమతా జెనర్జీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. 61 ఏళ్ళ మమత ఒంటిచేత్తో రాజకీయాలు నడిపి ఘన విజయం సొంతం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని 2011లో ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ మరోసారి సత్తాచాటింది. ఉమ్మడిగా పోటీచేసిన వామపక్షాలు, కాంగ్రెస్ మమతకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా ఆమె ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయాయి. బిజెపి నుంచి అయితే దిగ్గజాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సహా అనేక మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ప్రచారం చేసినా మమత దూకుడును అడ్డుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మమత 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తృణమూల్‌కు మమతనే వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. రాష్ట్రంలో మూడు దశాబ్దాలకు పైగా అధికారం చెలాయించిన వామపక్ష కూటమిపై ఆమె అలుపెరగని పోరాటాలు నడిపారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం చరిత్ర సృష్టించారు. ఐదేళ్ల పాలనపై ప్రతిపక్షాలు ఎంత దుమ్మెత్తిపోసినా ఆమె వెరవలేదు. రెండు ప్రధాన రాజకీయ కూటములను ఎదుర్కొంటూ వచ్చారు. లెఫ్ట్ ప్రభుత్వంపై వీధుల్లోకి వచ్చి పోరాడిన మమతాబెనర్జీని అభిమానులంతా దీదీ (సోదరి) అని పిలుచుకుంటారు. రాష్ట్భ్రావృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా శారదా చిట్స్ కుంభకోణంలో అనేక విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. 2011లో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన స్థానిక ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. బాలికల కోసం కన్యశ్రీ, విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పథకం సబుజ్ సాతీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. మధ్యతరగతి కుటుంబం, స్వాతంత్య్ర సమరయోధుని ఇంట జన్మించిన మమతా బెనర్జీ లా పట్ట్భద్రురాలు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రత ముఖర్జీ ఆమెకు రాజకీయ గురువు. ప్రస్తుతం ఆయన మమత కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన మమతా బెనర్జీ సిపిఎం దిగ్గజం సోమ్‌నాథ్ చటర్జీపై గెలిచి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీని ఓడించారు. అప్పట్లో ఎంపీలందరి కన్నా మమతానే పిన్న వయస్కురాలు.