జాతీయ వార్తలు

‘అమ్మ’ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 19: భారత రాజకీయాల్లో తమిళ ప్రజలకు ఇన్నాళ్లూ ఒక రికార్డు ఉండేది. అయిదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చటం తప్ప.. అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి పట్టం కట్టడం గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేదు. ఎప్పుడో 1977లో మహానటుడు ఎంజీ రామచంద్రన్‌కు వరుస విజయాలను కట్టబెట్టి పదేళ్ల అధికారాన్ని అందించిన తమిళ ప్రజలు మళ్లీ ఇంతకాలానికి ఆయన వారసురాలు జయలలితకు మళ్లీ అవకాశం ఇచ్చారు. చాలా ఏళ్ల తరువాత జయలలిత ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అన్న పదాన్ని జయించారు. ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న ఎంకే స్టాలిన్‌కు గట్టి సందేశానే్న పంపించాయి. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నీడలో ఉన్న స్టాలిన్‌ను తమ నాయకుడిగా అంగీకరించేందుకు తమిళ ప్రజలు సిద్ధంగా లేరని తేలిపోయింది. ఎన్నికలు మొత్తం జయలలిత ఒకవైపు.. మిగతా ప్రత్యర్థులంతా మరో వైపు అన్నట్లుగానే సాగింది. అంతా కలిసి ఏకమై జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆమె గెలుపును అడ్డుకోలేకపోయారు. అమ్మ క్యాంటీన్ వంటి పలు ప్రజాకర్షక పథకాలు జయలలిత విజయానికి పూలబాట వేశాయని చాలామంది విశే్లషకులు అభిప్రాయపడ్డారు. ఏమైనప్పటికీ, విపక్షాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి విజయబాటలో నడిపించటంలో కరుణానిధి పార్టీ డీ ఎంకే వైఫల్యం జయలలిత విజయంలో కీలక పాత్ర పోషించింది.
కుటుంబ రాజకీయాలకు చరమగీతం
తమిళనాడు ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి చరిత్రను తిరగరాశారని అన్నాడి ఎంకే అధినేత్రి, పురచ్చితలైవి జయలలిత అన్నారు. డిఎంకే కుటుంబ రాజకీయాలకు ఈ ఎన్నికలు ముగింపు పలికాయని ఆమె అన్నారు. ‘ఈ ఎన్నికలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాయి. ప్రచార సందర్భంలో డీఎంకే అబద్ధాలకు.. ఆ పార్టీ కుటుంబ రాజకీయాలకు శాశ్వతంగా ప్రజలు పుల్‌స్టాప్ పెట్టారు’ అని ఎన్నికల ఫలితాల అనంతరం జయలలిత అన్నారు. తనకు చరిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఆమె తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు మాటలు చాలటం లేదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ప్రజలకే అంకితం. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అన్నాడీఎంకే మ్యానిఫెస్టోలో చేసిన అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని.. ఈ బ్రహ్మాండ విజయం కోసం నిరంతరం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు, మిత్రపక్షాలకు, నాయకులకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు.