జాతీయ వార్తలు

బెంగాల్‌లో ఓటమిపై సమీక్షించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: కేరళలో వామపక్ష (ఎల్‌డిఎఫ్) కూటమిని గెలుపు చరిత్రాత్మకమని, బెంగాల్‌లో ఓటమిపై సమిక్షించుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గురువారం ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యలయంలో ఏచూరి మాట్లాడుతూ ఎల్‌డిఎఫ్ కూటమిని కేరళలో ప్రజలు ఆదరించారని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి, పరిపాలన దుర్వినియోగాన్ని ప్రజలు తిరస్కరించారని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ హింసను ఎదురొడ్డి ప్రచారం నిర్వహించిన లెఫ్ట్ కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌లో బిజెపికి తృణమూల్ కాంగ్రెస్‌కు ఓట్లు బదిలీ అయ్యాయని, అందుకే బిజెపి మొదటిసారిగా అసెంబ్లీ అడుగుపెట్టిందని ఏచూరి స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో ధనప్రవాహం స్పష్టంగా కనిపించిందని, అక్కడ ఆరు పార్టీలతో కూడిన కూటమి ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామని వెల్లడించారు. అసోంలో ప్రభుత్వ వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ ఓడిందని ఆయన విశే్లషించారు. పుదుచ్ఛేరి శాసనసభలో నాలుగు దశాబ్దాల తరువాత వామపక్షాలు ప్రాతినిధ్యం లభించడం శుభపరిణామం అన్నారు.