జాతీయ వార్తలు

ఇద్దరు ముస్లిం వ్యాపారుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లతేహార్ (జార్ఖండ్), మార్చి 19: ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు పశువుల వ్యాపారుల మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది మతఘర్షణలు దారితీసే ప్రమాదం ఉండడంతో నిషేధాజ్ఞలు విధించారు. లతేహార్ జిల్లాలోని జాబ్బర్‌లోని ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో జనం రోడ్లపైకి వచ్చి రాకపోకలను దిగ్బంధనం చేశారు. మజ్లూమ్ అన్సారీ (32), ఇంతియాజ్ ఖాన్ (13)ను ఎక్కడో చంపేసి చెట్టుకు వేలాదీశారని జనం ఆందోళనకు దిగారు. మృతదేహాలను తీసుకొచ్చి బాలూమథ్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు చేశారు. రహదారి దిగ్బంధన చివరికి హింసకు దారి తీసింది. ఒక సబ్‌డివిజనల్ అధికారి, ఆరుగురు పోలీసులు రాళ్ల దాడిలో గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. జనం రాళ్లు విసరడంతో సివిల్ ఎస్‌డిఓ కామేశ్వర్ నారాయణ్, ఎఎస్‌ఐ శ్వామ్‌దేవ్ మిశ్రా, నలుగురు పోలీసులు గాయపడ్డారని ఎస్‌పి అనూప్ బిర్థ్‌రే వెల్లడించారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పొరుగున ఉన్న ఛాత్రా జిల్లాలో తుటివాలాలో జరిగే వార్షిక సంతకోసం పశువులను తీసుకెళ్లిన ఇద్దరూ శవాలై కనిపించారు. కాగా ఈ జంట హత్యల కేసుతో ఎనిమిది మందికి సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామని, మిగతా ముగ్గురికోసం గాలిస్తున్నట్టు ఎస్‌పి తెలిపారు. అరెస్టయిన మిథిలేశ్ ప్రసాద్ సాహూ అనే వ్యక్తికి గోక్రాంతి మంచ్ అనే సంస్థతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. ఈ సంస్థ గో సంరక్షణ కోసం పనిచేస్తోంది.

ఉత్తరాఖండ్‌లో ముదురుతున్న సంక్షోభం
రావత్‌కు మెజార్టీ లేదంటున్న బిజెపి 28న బలపరీక్షకు గవర్నర్ ఆదేశం

డెహ్రాడూన్/న్యూఢిల్లీ, మార్చి 19: ఉత్తరాఖండ్‌లో తమకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు తెలియజేస్తున్నారని బిజెపి పేర్కొంటూ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌ను గద్దె దింపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. అయితే శాసనసభలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని హరీష్ రావత్ ప్రకటించారు. దీంతో ఈ నెల 28న ముఖ్యమంత్రి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ శనివారం స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై బిజెపి, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వాద, ప్రతివాదనలతో వాతావరణం వేడెక్కడంతో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాల్ హెచ్చరించారు. ‘శాసనసభలో ఇంతకుముందు బిల్లును ఆమోదించినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు. మూజువాణి ఓటుతో బిజెపి సైతం ఈ బిల్లును ఆమోదించింది’ అని ఆయన అన్నారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి నోటీసు ఇవ్వడం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ నోటీసు చెల్లుబాటు అవుతుందా లేదా అన్నదానిపై శాసనసభ్యులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని, కనుక ఈ నోటీసు శాసనసభలోకి ఎప్పుడు వస్తుందన్నదీ వేచి చూడాల్సిందేనని తెలిపారు.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ రాజకీయ, ధన బలాలను ఉపయోగించి బిజెపి యేతర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. అయితే రాష్ట్ర శాసనసభలో హరీష్ రావత్ మెజార్టీ కోల్పోయారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలియజేస్తున్నందున రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీని ఆహ్వానించాలని ఉత్తరాఖండ్ బిజెపి ఇన్‌చార్జి శ్యామ్ జాజు పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.