జాతీయ వార్తలు

ఉత్తరప్రదేశ్ బరిలో ప్రియాంక లేదా రాహుల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తిరిగి స్వర్ణయుగం తీసుకువచ్చేందుకు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తురుపుముక్కల్ని ప్రయోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి ప్రచార వ్యూహకర్తగా.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమికి వ్యూహకర్తగా వ్యవహరించిన కిశోర్.. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకుగానూ కాంగ్రెస్ పక్షాన ప్రచార వ్యూహాన్ని రచించబోతున్నారు. అందులో భాగంగానే రాహుల్, ప్రియాంకల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించటం ద్వారా భారీ లబ్ధిని పొందేందుకు ఎత్తుగడ వేశారు. ఒకవేళ ఇద్దరు గాంధీలు ఒప్పుకోకపోతే రాష్ట్రంలో పేరున్న బ్రాహ్మణ నాయకుడిని యూపీ ఎన్నికల చిత్రంపైకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. ఒకప్పుడు యూపీలో తిరుగులేని శక్తిగా అన్ని సీట్లనూ గెలుచుకున్న కాంగ్రెస్.. గత రెండు దశాబ్దాలుగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండే రెండు స్థానాల్లో అది కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కుమారుడు రాహుల్ మాత్రమే తమ సీట్లను కాపాడుకోగలిగారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఫలితాలు వచ్చిన తరువాత (మే 16) యూపీ ఎన్నికలకు నాయకత్వం వహించేది ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించవచ్చు.
యూపీ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఇద్దరు గాంధీలలో ఒకరు ఎన్నికలను లీడ్ చేస్తే తప్ప ఫలితం రాదని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 10 నుంచి 12శాతం బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారు. మండల్ మందిర్ వివాదాల నేపథ్యంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లయిన బ్రాహ్మణులు బీజేపీ వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు వారి మద్దతును కూడగట్టుకోవటం కాంగ్రెస్‌కు చాలా అవసరం. దీనికితోడు సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీలకు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. అటు కాంగ్రెస్ రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవటంతో పూర్తిగా బలహీనమైపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు బాధ్యత వహించక తప్పదన్నది ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం. దీనిపై గాంధీలు ఏ స్థాయిలో అంగీకరిస్తారు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ విధంగా ప్రతిస్పదిస్తుందీ వేచి చూడాల్సి ఉంది.