జాతీయ వార్తలు

ఓటమెరుగని వీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల, మే 2: కేరళలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, ఓటమంటే ఎరగని కేరళ కాంగ్రెస్ (ఎం) అధినేత కెఎం మణి 13వ సారి పాల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 83 ఏళ్ల మణి ఇదే నియోజకవర్గం నుంచి 12 సార్లు గెలిచారు. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ్యునిగా స్వర్ణోత్సం జరుపుకొన్న మణి మళ్లీ గెలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కొట్టాయం జిల్లా పాల అసెంబ్లీ నియోజవర్గం వర్గంనుంచి 1965లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం తరువాత 11 ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 1967, 70, 77, 1980, 82, 87, 1991, 96, 2001, 2006, 2011 ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన కెఎం మణి అసెంబ్లీలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. యుడిఎఫ్ భాగస్వామ్య పార్టీలో మణి కాంగ్రెస్సే మూడో అతిపెద్ద పార్టీ. న్యాయశాస్త్ర పట్ట్భద్రుడైన ఆయన గత ఏడాది వెలుగుచూసిన అవినీతి కుంభకోణం తరువాత మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన మణి తిరిగి పాల నియోజవర్గం నుంచే బరిలో దిగారు. సెంట్రల్ ట్రావెంకోర్‌ను ఆనుకునే ఉండే పాల సెగ్మెంట్‌లో రోమన్ కేథలిక్‌లు ఎక్కువ. ఎల్‌డిఎఫ్-ఎన్‌సిపి అభ్యర్థి మణి సి కప్పన్ ఆయనపై పోటీ చేస్తున్నారు. గతంలో కూడా మణికి కప్పన్ గట్టిపోటీనే ఇచ్చారు.