జాతీయ వార్తలు

పిఎఫ్‌పై వడ్డీ రేటు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్‌ఓ) వడ్డీ రేటును కేంద్రం .1 శాతం పెంచింది. వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పిఎఫ్ వడ్డీ రేటు .1 శాతం పెరగడం పట్ల సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) చైర్మన్‌గా సంతోషం వ్యక్తం చేశారు. తొలుత వడ్డీ రేటును 8.7 శాతం కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపిందని, అయితే, 8.8 శాతం ఇచ్చినా ఈపిఎఫ్‌వో వద్ద ఇంకా మిగులు ఉంటుందని ఆర్థిక శాఖకు తన మంత్రిత్వ శాఖ సూచించిందన్నారు. పెంచిన వడ్డీ రేటు 2015-16 సంవత్సరం నుంచే అమలవుతుందని, వడ్డీ రేటు పెంచినా ఖాతాలో 673 కోట్లు మిగులు బడ్జెట్ ఉందన్నారు. ఇంకా పిఎఫ్‌లోకి 2.89 లక్షల ఖాతాదారులను చేర్చాల్సి ఉందని ఆర్థిక శాఖ తెలిపిందన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని, దానికోసం అందోళన చేందాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖకు తెలిపామన్నారు. ఆరు కోట్లు ఉద్యోగులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్లను ఇప్పటి వరకూ జారీ చేశామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు.