జాతీయ వార్తలు

సత్తాచాటిన ఇస్రో శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి రాకెట్ల విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి గురువారం మధ్యాహ్నం 12:50 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ద్వారా ఇస్రో చేపట్టిన ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాన్ని శాస్తవ్రేత్తలు అనుకొన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం షార్‌లో సిగలో మరో కలిగి తురాయిగా నిలిచింది. దీంతో ఇస్రో ప్రతిష్ట కూడా ఇనుమడించి ఆగ్ర దేశాల సరసన భారత్ నిలిచింది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 34 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగాయి. ఇది 35వ ప్రయోగం కావడంతో పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహ ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. తొలి ప్రయోగం మినిహా మిగిలినవన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకాయి. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టిన బుడిబుడి అడుగులు వేసుకొంటున్న శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరారు. గతంతో ఇదే తరహాలో చంద్రయాన్-1 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఇస్రోదే. అరుణగ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపి శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. మళ్లి ఆగ్ర దేశాలకు దీటుగా నావిగేషన్ సేవలకు శ్రీకారం చుట్టి సొంత నావిగేషన్ వ్యవస్థకు రూపకల్పనలో మన శాస్తవ్రేత్తలు విజయం చెందారు. శ్రీహరికోట నుండి గురువారం ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం నిర్ధేశించిన సమయానికే ఉపగ్రహాన్ని 20:19నిమిషాల్లో 284కి.మీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో శాస్తవ్రేత్తలతోపాటు ఉద్యోగులందరూ సంబరాలు చేసుకొన్నారు. షార్‌తో పాటు పక్కనే సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగ విజయంతో ఇదే ఉత్సాహంతో నావిగేషన్ వ్యవస్థ సొంతంగా దేశానికి సమకూర్చుకొనే అవకాశం దక్కింది. ఇంతకు జిపిఎస్ సేవల కోసం అమెరికా తదితర దేశాల పై ఆధాపడేవారు. ఇప్పుడు అటువంటి బాధలేదు. మనమే మన దేశం చుట్టు 1500కి.మీ దూరంలో ఉన్న ఇతర దేశాల అవసరాలకు కూడా సేవలు అందించవచ్చును. ఎన్నోయేళ్లు కల నేటికి ఫలించడంతో దేశంలో ఉన్న శాస్తవ్రేత్తలు స్పేస్ సైన్సు రంగంలో ఎంత ప్రగతి చెందింతో దీనిని బట్టే అర్ధమవుతోంది. సామాన్య మానవుకి సైతం ఈ సేవలు అందేందుకు ఇస్రో ఎంతో శ్రమించింది. దీంతో అగ్రరాజ్యాల సరసన భారత్ నివడమే కాకుండా నావిగేషన్ సేవలు కలిగిన 5 దేశాల సరసన భారత్ చేరింది.