జాతీయ వార్తలు

చేనేత కార్మికులనూ ఉపాధి హామీ పథకంలో చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చేనేత కార్మికులను మహత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కిష్టప్ప గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. చేనేత కార్మికులకు అతి తక్కువ వేతనాలు లభిస్తున్నాయి, దీనివలన వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే వీరిని ఉపాధి హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలి. దీనికోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కిష్టప్ప విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయని ఆయన సూచించారు. ఉపాధి హామీ కింద వ్యవసాయ కార్మికులకు రోజుకు 159 రూపాయలు లభిస్తే, చేనేత కార్మికులకు ఇంతకంటే తక్కువ ఆదాయం లభిస్తోందని కిష్టప్ప వాపోయారు. చేనేత రంగంలో దాదాపు 4.38 మిలియన్ల మంది కార్మికులు పని చేస్తున్నారు, సరైన వేతనాలు లేకపోవటంతో వీరు దుర్భర జీవితాలను గడుపుతున్నారని కిష్టప్ప చెప్పారు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.