జాతీయ వార్తలు

మంచినీళ్లు లేవు.. ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి ఎన్‌డిఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌కు మంటినీటిని సరఫరా చేస్తున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు, మంజీరా రిజర్వాయర్లు దాదాపుగా ఎండిపోయాయి, దీనితో కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు, అయితే ఇవి కూడా త్వరలోనే ఎండిపోయే ప్రమాదం నెలకొన్నదని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గొట్టపు బావులు కూడా ఎండిపోతున్నాయి, ట్యాంకర్ల ద్వారా ఎక్కువ కాలం మంచినీటిని ప్రజలకు సరఫరా చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.