జాతీయ వార్తలు

సరాసిన్ బ్యాంకులో సోనియా సొమ్ము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాకు సంబంధించి మరో బాంబు పేల్చారు. ‘వీవీఐపి చాపర్ కేసులో ముడుపులు తీసుకున్న సోనియాగాంధీ, ఆ డబ్బును జెనీవాలోని సరాసిన్ బ్యాంకులో దాచి ఉంచార’ని స్వామి గురువారం ఆరోపణ చేశారు. ‘సోనియా ముడుపులు తీసుకున్న మాట వాస్తవం. ఆ సొమ్మును జెనీవాలోని సరాసిన్ బ్యాంకు, పిక్టెట్ బ్య్కాంలో దాచారు.’ అని ఏబీపీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఈ బ్యాంకుల వివరాల ఆధారంగా సోనియాగాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు వీవీ ఐ పి చాపర్ కేసులో ఇటలీ లోని మిలన్ కోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న సింగ్నోరా గాంధీ అంటే సోనియానే అంటూ స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు మన్మోహన్‌సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, అహ్మద్ పటేల్‌ల పేర్లను కూడా తీర్పులో ప్రస్తావించారు. 225పేజీల ఈ తీర్పులో ‘సింగ్నోరా’ అంటే పేరైనా కానీ, లేదా ఇటాలియన్ మాట్లాడే వివాహిత మహిళ లేదా శ్రీమతి, మేడమ్ అన్న సంబోధన కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి జరిగిందన్నది వాస్తమని తీర్పు స్పష్టం చేసింది.